Temper Telugu Chalana Chitram Good Temperament Police Story

Temper Jr.NTR Super Hit Telugu Movie

Temper Jr. NTR Good Message WIth Temperament Style

Temper Jr. NTR Good Message with temperament style. టెంపర్ ఆధునీకరణ సమాజంలో మారుతున్న వేష భాషల సంప్రదాయం అనుగుణంగా సినిమాలు చిత్రీకరించడం పూరి జగన్నాద్ శైలి అని చెప్పవచ్చు. అలానే అడువారుపై కొంతమంది జరిపే ఆకృత్యాలపై తనదైన శైలిలో చిత్రం తీసి చూపారు. ఒక లంచగొండి పోలీసు అధికారి ఎంత బాగా లంచాలు వసూలు చేస్తారో, అతను మార్పు చెందితే ఎంత పరిణితిని చూపుతారో ఈ చిత్రంనుండి చూడవచ్చు. ఆడపిల్లకు అన్యాయం జరిగింది అంటే సగటు భారతీయుడు భావోద్యేగం పొందితే, మరీ పరిణితి చెందిన పోలీసు అధికారి ఆ అన్యాయ దృశం చూస్తే, ఎంతవరకు వెళ్లి ఆ దోషులను శిక్షిస్తాడు అనేది ఈ చిత్రం నుండి చూడవచ్చు.

చిత్రతారాగణం: JR. N T రామారావు, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణ మురళి, ప్రకాష్ రాజు తదితరులు.
చిత్రనిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ – బండ్ల గణేష్
సంగీతం: అనుప్ రూబెన్స్, మణిశర్మ
కధ: వక్కంతం వంశీ
దర్శకత్వం: పూరి జగన్నాధం
విడుదల:13-02-2015

బాలకుడు పోలీసు అధికారి కావాలని నిశ్చయించుకుని, SI అవ్వడం.

సముద్ర్హపు అలల దృశ్యాలపై టెంపర్ చలనచిత్ర శీర్షికలు (Titles) వస్తూ, ఆ టైటిల్స్ పూర్తయ్యేసరికి బీచ్లో కొంతమంది వ్యక్తులు పడిఉండడం, కనబడటంతో బాటు, కదానాయుకుడు క్రిందనుండి పైకి కష్టంగా లేవడం, చిత్ర ప్రారంభ దృశ్యం. కదానాయుకుడి మాటల్లోంచి జరిగిన కధలోకి అంటే కదానాయుకుడి జీవితంలో చిన్ననాటి సన్నివేశాలు ప్రారంభం అవుతాయి. బాల్యంలోనే పోలీసు స్టేషన్లో SI తో తన్నులు తినే కుర్రవాడు, కొడుతున్న SIతో ఎదురుతిరిగి నేను జానీ బాయ్ మనిషిని అంటే, సమయానికి వచ్చిన జానీ బాయ్ ని కూడా SI కొడతాడు. జానీ బాయ్ ని నీవు ఎందుకు SI ని కొట్టలేదు అని అడిగితే జవాబుగా జానీ బాయ్ ఆ కుర్రవాడితో “వారు పోలీసులు వారి డ్రెస్ అటువంటిది అది ఉంటే వారిని ఆపేవారుండరు, అడిగేవారుండరు అంటూ” బదులిస్తాడు, వెంటనే ఆ కుర్రవాడు జానీ బాయ్ తో నేను పోలీసు అవుతా నీదగ్గర పనిచేయను అని వెళ్ళిపోతాడు. పోలీస్ పవర్ వెరీ పవర్ ఫుల్ అనుకుని పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు.

రాత్రి బడిలో చదువుతూ పగలు పనిచేస్తూ ఉంటూ, పోలీసుల ఆదాయ మార్గాలను పరిశీలన చేస్తూ ఉంటాడు. “రెండూవైపులా డబ్బులు గుంజే అవకాశం మరియు అధికారం పోలీసు ఉద్యోగం వలన బాగుంటుంది అని బలంగా భావిస్తాడు ఆ కుర్రవాడు. మధ్య మధ్యలో పోలీస్ చిత్రాలు చూడడం వలన పోలీస్ మరియు సమాజంలో విషయాలపై కూడా ఒక అవగాహనా ఏర్పడుతుంది. పోలీసుగా ఎలా ఉండాలి, సమాజంలో రౌడిలతో ఎలా లౌక్యంగా ఉండాలి అనే విషయాలు బాగా వంటబట్టించుకుంటాడు. మొత్తం మీద పోలీసు ఇన్స్పెక్టర్ అవుతాడు. పోలీసు అయిన ఆ కుర్రవాడు పేరు దయా (ఎన్టీఆర్). ఏ జానీ బాయ్ దగ్గర పనిచేసాడో, ఆ జానీ బాయ్ ని హైదరాబాదులో పోలీసు SIగా కలుస్తాడు దయా. ఒక చావుకేసుని ఎన్ని రకాలుగా వాడుకుని ఎంత పైసావసూల్ చేయవచ్చో అంత ఒక శవాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని గంటల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తాడు దయా.

వైజాగ్లో నేర ప్రవృత్తి కలిగి ఉండి చట్ట వ్యతిరేక పనులతో ఒక సమూహంతో తిరిగే వ్యక్తి వాల్తేరు వాసు (ప్రకాష్ రాజు)కి మంత్రితో సాన్నిహిత్యం ఉండడం వలన తనకి పోలీసులతో ఎక్కువగా సమస్యలు ఉండకుండా, తనకి మద్దతుగా నిలబడే SI ని తన ప్రాంత పోలీసు స్టేషనుకి SI గా పోస్టింగ్ వేయించమని చెప్పి మరీ, దయాని SIగా రప్పించుకోవడం జరుగుతుంది.

హెడ్ కానిస్టేబుల్ సెల్యూట్ చేయకపోవడం, ప్రియురాలి కోరిక దయా మార్పుకి మూలం.

గాంధీ జయంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి (పోసాని కృష్ణమురళి) స్టేషన్ గోడకి ఉన్న గాంధీగారి ఫోటోకి పూలదండ వేయగానే, కొత్త SI మన స్టేషనుకి వస్తున్నట్టు, ఆ SI క్యారెక్టర్ గురించి వివరిస్తాడు. అలా వివరిస్తుండగా దయా SI పోలీసు స్టేషనుకి ఎంట్రీ ఇస్తే, హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి తప్ప మిగిలినవారు సెల్యూట్ చేస్తారు SI దయాకి. అది గమనించి ముర్తిగారిని SI దయా ప్రశ్నిస్తే, బదులుగా చేయి బాగోలేదని మూర్తిగారు బదులిస్తాడు, కానీ SI దయా క్యారెక్టర్ గురించి విన్నాక అతనికి సెల్యూట్ చేయడనికి ఇష్టం లేదని అర్ధం అవుతుంది మనకి. FIR తగలబడుతుండగా దానిని ఆర్పే ప్రయత్నంలో చేయిని ఉపయోగించడంతో మూర్తి ఆంతర్యం SIకి అర్ధం అయ్యి, చేయి బాగానే ఉందికదా సెల్యూట్ చేయమంటే, మీ గురించి విన్నాక, ఇప్పుడు చూశాక నా చేయి సెల్యూట్ చేయడానికి పనిచేయదు అంటాడు కానీ SI దయాకి కానిస్టేబుల్ మూర్తి సెల్యూట్ చేయడు. వీరి ఈ బంధం చివరికి మారి బలపడడం చిత్రంగా దయాలో మార్పు రావడానికి కారణమయ్యే దయా ప్రేమ.

దయాని వైజాగ్ రప్పించిన వాల్తేరు వాసుని కలిసి అతనికి సంఘీభావం ప్రకటించిన దయా, జంతువులను పెంచే అలవాటుగా ఉన్నశాన్వి (కాజల్ అగర్వాల్) ని చూసి ప్రేమలో పడతాడు ఇన్స్పెక్టర్ దయా, తరువాత ఆమెతో పరిచయం పెరగడానికి ప్రయత్నించి, ఆమెకు దగ్గర అవుతాడు. కానీ SI దయా అవినీతిగా సొమ్ము సంపాదించడం తప్పు అని SI కానిస్టేబుల్ మూర్తి నిలదీయడం, వారి మధ్య సంబాషణ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దయా, మరియు శాన్వి (కాజల్ అగర్వాల్) బీచ్లో మాట్లాడుతుండగానే శాన్విని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకుపోతుంటే, దయా వారిని వెంబడిస్తాడు. పొరపాటున వేరే అమ్మాయిని (లక్ష్మి)ని తీసుకురాబోయి నీ గర్ల్ ఫ్రెండుని తీసుకువచ్చారని, శాన్వినిచూసి వాల్తేరు వాసు దయాకి క్షమాపణ చెబుతాడు. కాని నా స్థానంలో ఉండి చనిపోవాల్సిన అమ్మాయి(లక్ష్మి)ని కాపాడితే అదే నువ్వు నాకు ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ అని అంటుంది.

దయా(ఎన్టిఆర్), తన ప్రేమకోసం ప్రియురాలి కోరిక తీర్చడం కోసం వాల్తేరు వాసుతో గొడవ పెట్టుకొని, లక్ష్మిని కాపాడతాడు. కాని అప్పటికే దయాకి, వాసుకి ఉన్నసంభందం వలన, లక్ష్మిని ఎందుకు చంపడం అంటే, లక్ష్మి దగ్గర ఉన్న ఆధారం వలన తన తమ్ముళ్ళ జీవితం ఆధారపడి ఉంది అని చెబుతాడు వాల్తేరు వాసు, దయాతో. దానికి దయా ఆమెను చంపడం కన్నా, ఆమె దగ్గర ఉన్న ఆధారం నీకు అందిస్తాను అంటే, అంగీకరిస్తాడు, వాసు.

దయా(ఎన్టిఆర్)కి మనసిక ఆవేదనను కలిగించే లక్ష్మి ఆవేదన

తరువాత లక్ష్మిని విదేశం పంపించేస్తాను, నీ దగ్గర ఉన్నఆధారం తనకు ఇచ్చేస్తే, నేరస్తులకు శిక్ష పడేలా చూస్తాను అని, ఆమె దగ్గర ఉన్న ఆధారం అయిన CDని తీసుకుని, ఆమెను విదేశం పంపించేస్తూ ఉన్న ప్రయత్నంలో, లక్ష్మి ఆవేదన ఆమె దయాని సంభోదించిన వైనం, దయా మానసిక క్షోభ కలుగుతుంది. లక్ష్మి విదేశం వెళ్ళిపోయాక CD వాల్తేరు వాసుకి అప్పజేప్పకుండా, వాసు మనుషుల్ని కొట్టి వెనుకకి పంపిస్తాడు. అప్పటి వరకు SI దయాకి (ఎన్టిఆర్) కి సెల్యూట్ చేయని, హెడ్ కానిస్టేబుల్ నారాయణ మూర్తి (పోసాని కృష్ణ మురళి) హృదయపూర్వక సెల్యూట్ చేయడంతో దయా పూర్తీగా నిజాయతి పోలీసు అధికారిగా మారతాడు. అది ఎంతలా అంటే, నేరస్తులకు శిక్ష పడడం కోసం, ఆ నేరంలో తను పాల్గొన్నాను అని, అందువలన నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి మమ్మల్ని దమ్ముంటే ఉరి తీయండి అని కోర్టుకి సవాలు విసిరే స్థాయిలో.

ఇంతకీ CD లో ఉన్న ఆధారం ఏమిటి ? ఆ CDలో ఉన్న ఆధారం చూసిన తరువాత ఎందుకు డబ్బే ప్రధాన పరమార్ధం అని ప్రకటించే పోలీసు అధికారి మార్పుకు కారణం అయింది అనేది చిత్రం చూస్తేనే బాగుంటుంది. కానీ ఆడపిల్లలకు అన్యాయం చేయడం తేలికగా చేయవచ్చు ఏమో కానీ అన్యాయం చేసినవారికీ శిక్ష పడే తీరుతుంది. అలాగే ఈ చిత్రంలో ఆడపిల్ల మానప్రాణాలను హింసాత్మకంగా దోచుకున్న నలుగురిని ఏవిధంగా కోర్ట్ శిక్ష విధించింది, ఆ శిక్ష అమలులో SI దయా అంతే హింసాత్మకంగా వారికి శిక్ష విధించడంలో చిత్ర కధ ముగుస్తుంది.

చిత్రవీక్షణ మనోల్లాసం కొరకు వెళుతూ ఉంటాం అయితే కొంతమందికి యుద్ద సన్నివేశాలు, కొంతమందికి ప్రేమ సన్నివేశాలు, కొంతమందికి యుగళగీతాలు, కొంతమందికి సెంటిమెంట్ సన్నివేశాలు, చాలామందికి హాస్య సన్నివేశాలు ఇలా చాలామందికి అనేక విషయాలు ఇష్టంగా ఉంటూ ఉంటాయి. అంతమంది దృష్టిలో పెట్టుకుని చిత్రం చిత్రీకరణ చేస్తూ, సందేశం ఇచ్చే చిత్రం చూపించాలంటే, ఆ చిత్ర యూనిట్ కష్టం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ దృష్ట్యా టెంపర్ చిత్రం లంచం తీసుకోకుండా అధికారి అవసరాలు తీరవు అని గ్రహించిన యువ పోలీసు అధికారి కధ, మంచి మెసేజ్ ఇస్తుంది. చెడులో కూడా మంచిని చూసేవాడు మంచే అవుతాడు, అలాగే మంచిని ప్రక్కనే పెట్టుకుని చెడుగా ఉన్న్దవారు కూడా మంచిగా మారతారు అని ఈ చిత్రం చెబుతుంది. అలా చెడుగా ప్రవర్తించే పోలీసు అధికారి SI దయా అయితే, అతనికి మంచిగా ఎప్పుడు కానిస్టేబుల్ నారాయణమూర్తి మరియు అతని ప్రియురాలు శాన్వి అంటిపెట్టుకుని ఉంటారు.

ధన్యవాదాలు
teluguchitratara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *