AlluArjun Good Movie SonOfSatyamurthy Telugu SuperHit Film For Values Only

S/o Satyamurthy: Very Nice Movie Showing Ethics Of Hero And His Father

S/o Satyamurthy: Very Nice Movie Showing Ethics Of Hero And His Father

S/o Satyamurthy: Very nice movie showing ethics of hero and his father story. Read in Telugu. తెలుగులో ఇంతకుముందు సామజిక విలువలు, కుటుంబ విలువలు, ఆచార సాంప్రదాయలు గురించి చెప్పే చిత్రాలు చాలానే వచ్చాయి. ఈ సినిమా తన తండ్రి చనిపోయినా తరువాత కూడా తన తండ్రిని ఎవరు చెడుగా భావించకుండా, తన తండ్రికి గల అప్పులు తీర్చేయడానికి ఆస్తి మొత్తం అమ్మేసి తీర్చేసి, కుటుంబ పోషణ భాద్యతను నెత్తిన వేసుకునే యువకుడి కధ. సన్ అఫ్ సత్యమూర్తి ఒక మంచి నైతిక విలువలను తెలియజెప్పే విధంగా చిత్రంగా నిలిచింది.

చిత్రతారాగణం: అల్లు అర్జున్, ఉపేంద్ర, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అలీ, సమంతా, స్నేహ, నిత్య మీనన్, బ్రహ్మానందం తదితరులు తారలుగా నటించిన చిత్రం.
చిత్రనిర్మాణం: హారిక హాసిని క్రియేషన్స్ – S. రాధాకృష్ణ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కధ-దర్శకత్వం:త్రివిక్రమ్ శ్రీనివాస్

ఉత్తమం ఎక్కడ నుండి వస్తుందో ఉత్తమం కానివి ఎన్ని అవకాశాలుగా కనిపిస్తాయో ఉత్తమం నుండి క్రిందికి జారిపోవడానికి అని తెలియజేసే చిత్రంగా సన్ అఫ్ సత్యమూర్తి తెలుగు చలనచిత్రం కనిపిస్తుంది. తన తండ్రి మరణిస్తే ఆ సానుబూతిని ఉపయోగించుకుని, తండ్రి చేయవలసిన చెల్లింపులు చెల్లించకుండా ఉండవచ్చు అని సన్నిహితులుగా పెద్దమనిషి చెప్పినా వినకుండా తండ్రి చెల్లించవలసిన చెల్లింపులు అన్ని తన ఆస్తి మొత్తం అమ్మేసి, పిచ్చిగా మారుతున్న అన్న, డిప్రెషన్లో ఉన్న వదిన, అమ్మ, అన్న కూతురుతో బయటికి వచ్చేస్తాడు, చిత్ర కదానాయుకుడు.

సన్ అఫ్ సత్యమూర్తి పాత్రలు

సత్యమూర్తి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తే, సత్యమూర్తి గారి అబ్బాయిగా అల్లు అర్జున్ చేస్తే, సత్యమూర్తి గారి సన్నిహితుడుగా రాజేంద్ర ప్రసాద్ పైడా సాంబశివరావుగా నటించారు. అలీ సత్యమూర్తిగారి అబ్బాయికి సహాయకుడిగా నటిస్తే, సమంతా సత్యమూర్తిగారి అబ్బాయికి ప్రియురాలిగా పైడా సాంబశివరావుకి అమ్మాయిగా సమీరగా నటించారు. మరో ముఖ్యపాత్ర దేవరాజ్ గా ఉపేంద్ర నటిస్తే, దేవరాజు భార్యగా స్నేహ నటిస్తే, దేవరాజ్ చెల్లెలి పాత్రలో నిత్య మీనన్ నటించారు. చిత్ర ప్రధమ భాగం నడవడానికి కారణమయ్యే పాత్రలలో రావురమేష్, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఒక మంచి కుటుంబాన్ని నడిపించిన వ్యక్తిగా, ఆ వ్యక్తికి తగిన తనయుడిగా అల్లు అర్జున్ నటన ఈ చిత్రం ఒక మంచి విలువైన చిత్రంగా నిలిచింది.

చిత్రం కదానాయుకుడి మాటలతో ఫైట్ సన్నివేశ దృశ్యంతో ప్రారంభం అయ్యి, జరిగిన కధ తెరపై ప్రత్యక్షం అవుతుంది, సత్యమూర్తిగారు అల్లు అర్జున్ సన్నివేశం మొదలు అవుతుంది. తెలివితేటలు మనిషి పనిచేయడానికి కాని ఇతరులను మోసం చేయడానికి కాదు అనే సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) గారి మాటలు కొత్తగా ఉన్నట్టుగా చెబుతూ తనకి తన తండ్రి ఒక అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసినట్టు చెప్పి, కదానాయుకుడు ఫారిన్ వెళ్లి పాట పడుకుంటాడు. పాటలోనే చిత్ర శీర్షికలు (Titles) మొదలవుతాయి. పాట పూర్తయ్యే సరికి సత్యమూర్తి మరణవార్త వింటాడు, చిత్ర కదానాయుకుడు. కష్టం తెలియకుండా కన్నకొడుకుని పెంచినా పరిస్థితులు కష్టాలు తెలియజేస్తాయి. అన్నట్టుగా కదానాయుకుడి కష్టాలు మొదలవుతాయి.

అస్తులుకన్నా తండ్రి గౌరవం పరువు ముఖ్యమని నిర్ణయించే సత్యముర్తిగారి కుటుంబం.

సత్యమూర్తిగారి మరణంతో అయన పెద్దకొడుకుకి మతి తప్పడం, అప్పులు వారికీ సత్యమూర్తిగారి రెండవ కొడుకు సమాధానం చెప్పవలసి వస్తుంది. సత్యమూర్తిగారి ఆఫీసులో పైడా సాంబశివరావు మరియు సత్యమూర్తిగారి అబ్బాయి అయిన అల్లు అర్జున్ మధ్య సంభాషణలు బాగుంటాయి. “300 కోట్ల రూపాయల ఆస్తి అంతా మీ వదిన మరియు అమ్మగారి పేరున పెట్టి, పనికిరాని షేర్లు మీపేరున పెట్టుకుని అప్పులవారికి, సదరు షేర్ పేపర్స్ ఇచ్చి, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అని సమాధానం చెప్పమని పైడా సాంబశివరావు సత్యమూర్తిగారి ద్వీతీయ కుమారుడికి సలహా చెబుతాడు, కానీ కదానాయుకుడు ఎక్కడా తనతండ్రికి చెడ్డపేరు రాకూడదు తన తండ్రిని ఎవరు తప్పుగా అర్ధం చేసుకోకూడదు అని తండ్రి అప్పులకు తానూ జవాబుదారి అని డాకుమెంట్లపై సంతకం చేస్తాడు.

పనికిరానివి ఉంచుకుని, పనికివచ్చేవి వదిలేశాడు అని పల్లవితో సత్యమూర్తిగారి అబ్బాయికి జరిగిన  నిశ్చితార్ధం రద్దు చేసుకుంటారు ఆమె తండ్రి. ఇక సత్యమూర్తి గారి వియ్యంకుడు వచ్చి, తన కూతురితో ఆస్తులు పోయినవి, నీ భర్తకి మతిలేదు, నీ మరిది మతిపోయే పనిచేసాడు ఈ కుటుంబంతో ఉండి, కష్టాలు పడడం కన్నా, నీ భర్తకి విడాకులు ఇచ్చేసి వచ్చేయి, నీకు మంచి భవిష్యత్తు చూపిస్తానని అంటాడు. కూతురు సమాధానంతో వెనుతిరుగుతాడు. వెళ్ళిపోయే అవకాశం ఉన్న వెళ్ళకుండా కుటుంబంతో కలిసి ఉన్న వదినగారిపై గౌరవం ఇంకా పెరుగుతుంది, సత్యమూర్తి గారి చిన్న కుమారుడికి. తన అన్నకూతురికి ఏ లోటు రాకుండా చూడాలని భావిస్తాడు. పాప స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో వేరే ఇంటికి సత్యమూర్తిగారి కుటుంబం మారుతుంది.

తనతో నిశ్చితార్ధం రద్దు చేసుకున్న అమ్మాయి పెళ్ళికి సత్యమూర్తిగారి అబ్బాయి పెళ్లి భాద్యత తీసుకోవడం

అన్న కూతురు స్కూల్ ఫీజు ప్రధానవిషయంగా మారితే, అందుకోసం ఉద్యోగవేట మొదలుపెడతారు సత్యమూర్తి చిన్న కుమారుడు. ఎక్కడా పనిదొరకక తన స్నేహితుడితో వాటా పనిగా ఒక పెళ్ళికి డెకరేషన్ చేసే నిమిత్తం ఒప్పుకుంటాడు సత్యమూర్తిగారి చిన్నఅబ్బాయి. తీర ఒప్పుకున్న పెళ్లి డెకరేషన్ తనతో నిశ్చితార్ధం రద్దు చేసుకున్న వారిదేనని, పెళ్లిపనులలో తెలుస్తుంది. తప్పక ఆ పనిచేయడానికి ఒప్పుకోవడం, అదే పెళ్ళిలో సమీర (షుగర్ కలిగిన అమ్మాయి) పరిచయం పెరగడం జరుగుతుంది. పైడా సాంబశివరావు వలన 300కోట్ల తండ్రి ఆస్తిని అమ్మేసి తన తండ్రి చేసిన అప్పులు తీర్చేసిన వ్యక్తి అని పెళ్ళిలో అందరికి తెలియడం, సమీర సత్యమూర్తిగారి అబ్బాయిపై మంచి అభిప్రాయం రావడం జరుగుతుంది.

పల్లవి పెదనాన్న అతని కొడుకు కలసి కట్నంగా ఇవ్వవలసిన కోటి రూపాయిలు దొంగతనంగా తీసుకుపోవడం వలన పల్లవి తండ్రి రావు రమేష్ ఆందోళన చెందుతాడు. ఆ ఆందోళనలో అతని స్నేహితుడు పైడా సాంబశివరావు పెళ్లి రద్దు చేసుకో అని మరలా సలహా ఇస్తే, సత్యమూర్తిగారి అబ్బాయి మీ పరువు పోకూడదు నేను మీ అన్నని వెతికి డబ్బు వారిని తీసుకుని వస్తా అని చెప్పి, వారిని తీసుకువచ్చి ఆ పెళ్లి జరిపిస్తాడు. తన నిశ్చితార్ధం రద్దు అయిన అమ్మాయి పెళ్లి సమస్యలో ఉంటే, భలే జరిగింది అని ఆలోచన చేయకుండా, ఆ పెళ్లి జరిగేల చేసిన సత్యమూర్తిగారి చిన్నకుమారుడుపై పైడా సాంబశివరావు తప్ప అందరికి గౌరవం పెరుగుతుంది. అదే పెళ్ళిలో సమీర సత్యమూర్తిగారి చిన్నకొడుకుకి తన ప్రేమ విషయం చెబుతుంది, అతను అంగీకరిస్తాడు.

తనతండ్రి అమ్మిన స్థలం దస్తావేజులు తేవడానికి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి సిద్దపడే సత్యమూర్తిగారి అబ్బాయి.

తమ ప్రేమను పెళ్ళిగా మార్చుకోవడానికి సమీర తండ్రిని కలవడానికి, సమీర ఇంటికి సత్యమూర్తిగారి చిన్నకొడుకు వస్తారు. అక్కడ అతనికి తన తండ్రి పరిచయస్తుడు, సమీర తండ్రి ఒకరేనని అర్ధం అవుతుంది. విలువలు కన్నా ధనమే మిన్న అని భావించే పైడా సాంబశివరావు పెళ్ళికి అంగీకరించకుండా సత్యమూర్తిగారి గురించి తక్కువ చేసి మాట్లాడతాడు, సత్యమూర్తిగారు మోసం చేసి ల్యాండ్ అమ్మడాని నిందిస్తాడు. మా నాన్న అమ్మిన ల్యాండ్ ఒరిజినల్ డాకుమెంట్స్ నేను తెచ్చి ఇస్తాను అంటే, అలాగే చేస్తే సమీర సత్యమూర్తిగారి అబ్బాయి వివాహం చేస్తానని పైడా సాంబశివరావు పందెం కాస్తాడు. గడువులోపులో సదరు ల్యాండ్ డాకుమెంట్స్ సంపాదించి ఇవ్వడంలో సత్యమూర్తిగారి లైఫ్ రిస్క్ చేయాల్సి వచ్చిన వెనుకకు తగ్గకుండా డాకుమెంట్స్ సంపాదించి ఇచ్చి తండ్రి గౌరవం పెంచుతాడు. తండ్రి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుచేసుకుంటూ, తండ్రి చెప్పిన మాటలు పాటించే వ్యక్తిగా విజయవంతం అవ్వడంతో చిత్ర కధ ముగుస్తుంది.

చిత్రంలో మరో ముఖ్య విషయం సత్యమూర్తిగారు పైడా సాంబశివరావుకి అమ్మిన లాండుని కబ్జా చేసిన వ్యక్తి (దేవరాజ్)ని వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ దేవరాజ్ ఎవరో తెలియకుండానే దేవరాజ్ చెల్లెలి ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకుంటారు సత్యమూర్తిగారు. అలా ప్రాణాలు దక్కించుకున్న దేవరాజ్ చెల్లెలి ప్రేమకోసం దేవరాజుతో ప్రాణాలకు తెగించి సత్యమూర్తిగారి అబ్బాయి పోరాటం చేయడమే చిత్రానికి పతాక ప్రారంభ సన్నివేశం. గొప్పవ్యక్తికి గొప్పగుణాలు ఉన్న కుమారుడే కలుగుతాడు అనే పైడా సాంబశివరావుగారి మార్పుతో చిత్రంలో కదానాయుకుడి పట్టుదల గెలుస్తుంది.

తండ్రి ఆలోచనతీరు చెడువైపు సాగిన తను మంచివైపుగా నిలబడి తండ్రి మార్పుకి కారణమైన కూతురు ప్రేమ గెలుస్తుంది చిత్రం చివరిలో. చివరికి చిత్రం విలువలను వాటి స్థాయిని పెంచేవిధంగా చిత్రీకరణ ఉంటుంది.

ధన్యవాదాలు

TeluguChitraTara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *