Dhruva RamCharan, AravindaSwamy, Navadeep & Rakul PreetSingh Telugu Super Hit Movie 2016

Dhruva – Telugu Remake chalanachitram !

Dhruva – Telugu Remake chalanachitram ! ధ్రువ రీమేక్ తెలుగు చలన చిత్రం

మంచిచెడుల కలయికలో మంచిని గెలిపించే ప్రయత్నంగా సినిమా కధలు సాగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో చెడును గురించిన వివరణ ఉంటే, అది మంచి యొక్క విశిష్టతను తెలియజెప్పే విధంగా సాగుతాయి. అలంటి వివరణలో ఒక తెలివైన వ్యక్తి  వేగం ఎదగాలని వక్రమార్గంలో వెళితే, నేరాలు-వార్తలు-ఘోరాలు పరిశోదనాత్మకంగా చూస్తూ విశ్లేషణ చేసుకుంటూ మరో తెలివైన వ్యక్తి ఎదిగి, వారు నిర్వహిస్తున్న వృత్తుల-ప్రవృత్తుల ఫలితాలు ఎదురెదురు పడితే ఎలా ఉంటుందో  తెలిపేది ధృవ. Dhruva-Telugu remake chalanachitram ! ధ్రువ రీమేక్ చలనచిత్రం !

చిత్రతారాగణం: రామ్ చరణ్, అరవింద స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, పోసాని కృష్ణ మురళి, నవదీప్ తదితరతారలు నటించారు.
చిత్రనిర్మాణం: అల్లు అరవింద్, NV ప్రసాద్ – గీత ఆర్ట్స్
మాటలు: వేమారెడ్డి
మూల కధ: మోహన్ రాజా
సంగీతం: హిఫోప్ తమిజ్హ
విడుదల తేది: 09-డిసెంబర్ 2016
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి

Dhruva Telugu remake chalanachitram ధ్రువ రీమేక్ తెలుగు చలనచిత్రం డిసెంబర్ 2016 లో విడుదల అయ్యి ప్రేక్షకాదరణ పొందింది, అయితే ఈ చిత్రం ముఖ్యంగా గమనించవలసినది. ఇద్దరు సమవుజ్జీలలో ఒకరు జీవితంలో చెడువైపు ఎలా ఎదిగినది మరొకరు మంచివైపు ఎలా అడుగులు వేసినది కధలో నీతిగా చూపించబడింది. మంచికి చెడుకి తేడా మనిషి ఆలోచనా తీరులో ఏవిధంగా సాగుతుందో ఈ ధ్రువ తెలుగు చిత్రం ద్వారా అవగాహనా చేసుకోవచ్చు.

కధాగమనం

కధ ప్రారంభం ప్రతినాయుకుడు పుట్టుకతో ప్రారంభం అవుతుంది. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తకు తన కుటుంబం కన్నా తమ పార్టీ అధినేతపై అభిమానం ఎక్కువగా చూపించే సన్నివేశంలోనే ప్రతినాయుకుడు పుట్టుక సన్నివేశం ఉంటుంది. ప్రతి నాయుకుడి తండ్రి ప్రాత్రలో పోసాని మురళి కృష్ణ బాగా నటిస్తే, ప్రతినాయుకుని పాత్రలో అరవిందస్వామి జీవించారు.

తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ, ఒకఊరికి వెళ్తున్న ద్వీతీయ నాయుకుడిగా నాజర్ నటించారు. ఎన్నికల ప్రచార సమయంలో చెంగల రాయుడు (పోసాని కృష్ణ మురళి) సదరు రాజకీయ పార్టీ జెండా కడుతూ కనిపిస్తుంటే, చెంగల రాయుడి ఫ్యామిలీ అతనిని హెచ్చరిస్తుండగా, సదరు పార్టీ నాయుకుడు కారులో ప్రచారనిమిత్తం ఆ ఊరికి రావడం, పార్టీ జెండా కట్టిన చెంగల రాయుడు ఆ రాజకీయ పార్టీ నాయుకుడి (నాజర్) దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడే చెంగల రాయుడి భార్యకి పురిటి నొప్పులు రావడంతో, నాయుకుడి కారులో ఆమెను ఆసుపత్రికి తరలించబోతే, మధ్యలోనే పురుడు వచ్చే మగ పురుషుడు జన్మిస్తాడు.

అతడే మన కధలో ప్రతినాయుకుడు సిద్ధార్ద్ అభిమన్యు(అరవిందస్వామి), ప్రతినాయుకుడినే ఎందుకు ముందు చూపించినట్టు అంటే, చెడు పూర్తిగా ఒక స్వరూపంగా మారే అవకాశం ఉంటే, సదరు చెడుకు కారణం అయ్యే వ్యక్తి ప్రతి అడుగు చాలా ప్రభావంతంగానే ఉంటే, సదరు చెడుని అంతమొందించే మంచి మాత్రం మెల్లగా మరింత పదునైన కత్తిగా తయారు అయి ఒక కదానాయుకుడిగా వస్తే అది ధృవ.

సిద్ధార్ద్ చదువులో రాణించడంతో అతనిని తమ రాజకీయ నాయుకుడికి పరిచయం చేయడానికి ఆ పార్టీ కార్యాలయానికి తీసుకునివెళతాడు చెంగలరాయుడు. వెళ్ళేటప్పటికి సదరు పార్టీ కార్యాలయంలో నాయుకుడు(నాజర్) అదే పార్టీ వ్యక్తితో గొడవపడి అతనిని బల్లకేసి గట్టిగా కొడితే మరణించడం జరిగితే, ఆ కేసు తనమీద వేసుకుని జైలుకి వెళ్లవలసినదిగా చెంగల రాయుడిని సదరు నాయుకుడు (నాజర్) కోరతాడు, కానీ కుర్రవాడైనా సిద్ధార్ద్ తన తండ్రిని ఎంఎల్ఏని చేయండి నేను ఆ చావుకేసు తనమీద నేను వెళతాను అని చెప్పి, సిద్ధార్ద్ జైలుకి వెళ్ళడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది. ఇక్కడ సిద్ధార్ద్ యొక్క ఆలోచన తీరు గమనిస్తే, తప్పు చేసినవాడికి శిక్షపడాలి అనే ధర్మాన్ని వదిలి, ఆ తప్పుని ఎలా తన ఎదుగుదలకు వాడుకోవచ్చు అనే విధంగా సాగుతుంది. అందుకే చదువుకుంటున్న (అంటే ప్రస్తుతం తానూ చేయవలసిన ధర్మం) వదిలి, జీవితంలో వేగంగా ఎదగడం కోసం తప్పుని సమర్ధించడానికి తన తెలివిని ఉపయోగించాడు సిద్ధార్ద్ ఇక్కడ ఆ సన్నివేశంలో.

ధృవ శీర్షికలలో ధృవ స్వయం వార్తావిశ్లేషణ ప్రారంభం

ఆ తరువాత ధృవ సినిమా శీర్షికలు (Titles) ప్రారంభం అయితే గమనించవలసిన విషయం వార్తాపత్రికలు (News పేపర్స్) చదువుతున్నట్టుగా దృశ్యాలు టైటిల్స్ బ్యాక్ గ్రౌండులో వస్తూ ఉంటాయి. పరోక్షంగా కదానాయుకుడు జీవితంలో ఎదుగుతున్న విధానంలో ప్రధాన విషయం వార్తలను (ధృవ) విశ్లేషించుకోనే అంశాన్ని దర్శకులు ఇక్కడ టైటిల్ ప్రదర్శనలో చూపించారు.

ఆ తరువాత సన్నివేశంలో చిన్నారుల కిడ్నాప్ కేసుని కధానాయుకుడి బృందం కాపాడే సన్నివేశం ఉంటుంది. అదే సన్నివేశంలో ధృవ (రామ్ చరణ్) పరిచయం కలుగుతుంది. పోలీస్ ట్రైనింగ్లో ఉన్న హీరో బృందం (నవదీప్ తదితరులు) అప్పటి అక్కడి నేర సంఘటనలు పోలీస్ ట్రైనింగ్లో ఉండగానే పరిష్కరించాలని కదానాయుకుడి నాయకత్వంలో చేస్తూ ఉంటారు. ఇక్కడ కదానాయుకుడికి సమాజంపై ఉన్న భాద్యత వ్యక్తమవుతుంది. పోలీస్ ట్రైనింగ్ పూర్తికాకముందే తనవంతు సమాజ సేవ చేస్తూ ఉండడం హీరో యొక్క ప్రముఖ లక్షణంగా కనబడుతుంది. తరువాత పాట ప్రారంభం.

పాట తరువాత వచ్చే సన్నివేశం ప్రముఖ రసాయనిక పారిశ్రామిక వ్యక్తుల మీటింగ్ ఏర్పాటవడం, ఆ మీటింగుని, కదానాయుకుడు ఫాలో అయ్యే సన్నివేశం అవ్వగానే, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ సభలో హీరో సంక్లిప్త ప్రసంగం ఉంటుంది. అప్పుడే ధ్రువ బృందానికి వచ్చిన మెసేజ్ కొంచెం వారిలో కలవరపాటు కలిగిస్తుంది. అయితే అది కధానాయిక రిషిక (రకుల్ ప్రీత్ సింగ్) పరిచయ సన్నివేశంగా మారుతుంది. ఇక్కడ నుండి కొంచెం కధానాయిక నాయుకుల మధ్య నడిచిన ప్రేమకధ పరిచయం చేసే సన్నివేశాలు చూడవచ్చు. అయితే ధ్రువ దృష్టి అంతా జరుగుతున్ననేరాలపై జరగబోయే నేరాలపై ఊహ దృష్తి ఎక్కువగా సాగుతున్నట్టుగా కనబడుతుంది, కాబట్టి ప్రేమ కధ సన్నివేశాలు, ఎక్కువగా కధానాయిక వైపు నుండే ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ చూశ చూశా ఒకే హృదయాన్నేపాట వస్తుంది, పాట తరువాత ఇషిక (రకుల్ ప్రీత్ సింగ్) తన ప్రేమను ధ్రువ(రామ్ చరణ్)కి చెప్పాడం జరుగుతుంది. అయితే ధ్రువ తన దృష్టి వేరువైపుగా సాగుతుంది కాబట్టి, ఆమె ప్రేమను అంగీకరించడు. ఇదంతా ఇషిక ధ్రువ స్నేహితులకు వివరించడం ఉంటుంది. ఆ వివరణ తరువాత..

ధృవ (రామ్ చరణ్ ) సిద్ధార్ద్ (అరవిందస్వామి) ప్రతినాయుకుడిగా గుర్తించడం.

జరిగే సన్నివేశంలో మెడికల్ షాపులో మెడిసిన్ తీసుకువెళుతున్న వ్యక్తులపై గోలుసుకోసం దుండగలు దాడి చేయడం జరగడం, ఆ దుండగుల కోసం ధృవ బృందం ప్రయత్నం చేసి సఫలం అయ్యి సదరు నేరస్తులను పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరుగుతుంది. తరువాత ధృవని, ధ్రువ బృందం తన స్నేహితుడి ఇంటికి అని చెప్పి, ఇషిక (రకుల్ ప్రీత్ సింగ్) ఇంటికి తీసుకువస్తారు. అక్కడ ఇషిక, ధ్రువ ఒంటరిగా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు నా సంగతి పట్టించుకోకుండా అని వాపోతుంది. అది ఆ ధ్రువ బృందానికి కూడా చెప్పకుండా తిరుగుతున్నాడని అర్ధం, ధృవని అతని స్నేహితులు నిలదీస్తారు. కానీ ధ్రువ విషయం వివరించడు, తరువాతి సన్నివేశంలో తాము పట్టించిన నేరస్తుడు ప్రముఖ రాజకీయ నాయుకుడితో ఉండే దృశ్యం ఉంటుంది. అప్పుడు ధృవ బృందంలో నిరుత్శాహం కలిగితే, అప్పుడు ఎవరికీ ఏమి చెప్పకుండా తిరుగుతూ ఏమి చేస్తున్నది, తాను ఏర్పరచుకున్న వ్యక్తిగత పరిశోదన ల్యాబులోకి తీసుకువెళ్ళి వారికి సమాజంలో జరుగుతున్నా నేర ప్రవృత్తి తీరుపై వివరణ ఇచ్చి మోటివేట్ చేస్తాడు.

సమాజంలో వార్తాపత్రిక వార్తలు, సమాజంలో జరిగే నేరాలు అలాగే సమాజంలో జరిగే వ్యాపారానికి ఉండే లింకు వ్యూహం వివరణ ఆసక్తిగా ఉంటుంది. ఇంకా ఈ సమాజంలో నేరం చిన్న నేరంగా చూపిస్తూ పెద్ద నేరాలను కప్పిపుచ్చే విధానంపై వివరణ ఇస్తాడు, అలంటి నేరాలలో ఒక రసాయన మందులు తయారు చేసే ఒక కంపెనీ నుండి వచ్చిన టెస్టింగ్ మెడిసిన్ ప్రయోగాత్మకంగా 18 మంది చిన్నపిల్లలపై ప్రయోగించి, ఆ పిల్లల మరణానికి కారణం అయిన పెద్ద నేరం కప్పి(మెడికల్ మాఫియా) ఉంచబడిందని, ధ్రువ తన బృంద స్నేహితులకు వివరిస్తాడు. అయితే నేరస్తుల జాబితాలో ఎక్కువ నేరాలకు కారణం అయిన ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు, అయితే వారు బయటి సమాజంలో ప్రముఖ వ్యక్తులుగా చలామణి అవుతూ ఉండేవారు. ఇంకా ఆ సన్నివేశంలో ప్రతినాయుకుడి తండ్రి అయిన చెంగల రాయుడు (పోసాని కృష్ణ మురళి) గనుల శాఖా మంత్రిగా ప్రేక్షకులకు పరిచయం అవుతారు. తరువాత సన్నివేశంలో కధానాయకుడు ప్రతినాయుకుడిని మూల నేరస్తుడుగా గుర్తించడం, కానీ అతను ప్రముఖ శాస్త్రవేత్తగా ఉంటాడు. అక్టోబర్ 3వ తేది చాలా ముఖ్యమైన తేదిగా సిద్ధార్ద్ భావిస్తే, ఆ తేదీనే సిద్ధార్ద్ చీకటి బ్రతుకుని బయట పెట్టాలని ధ్రువ నిశ్చయించుకోవడం జరుగుతుంది. తరువాత వచ్చే సన్నివేశాల్లో పోలీస్ పోస్టింగ్ సభలో ధృవ, సిద్ధార్ద్ చేతుల మీదగా పధకం అందుకుని, ధృవ తన పోలీస్ వృత్తిలో జాయిన్ అవుతాడు.

అప్పటికే సిద్ధార్ద్ విషయంలో పరిశోదన చేసిన ధృవ తానూ డ్యూటీలో జాయిన్ అవ్వడంతోనే సిద్ధార్ద్ పై ఏక్షన్ తీసుకోవడానికి సిద్దపడతాడు. అక్టోబర్ 3న జరగబోయే నేరాన్ని అరికట్టడం, అప్పటివరకు చీకటిలో సాగుతున్న నేర ప్రవృత్తి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డా కూడా ఒక వ్యక్తి తన చీకటి బ్రతుకుపై దెబ్బ కొట్టడంతో సిద్ధార్ద్ అప్రమత్తుడవుతాడు. తరువాత సిద్ధార్ద్, ధృవని పూర్తిగా మానిటర్ చేయడం, ధృవ స్నేహితుడు సాటి పోలీస్ అయిన నవదీప్ మరణం వలన ధృవలో అసహనం పెరగడం జరుగుతుంది. ఇంకా ఇదంతా తెరపై చూడడం బాగుంటుంది. ఎన్ని తెలివితేటలూ కలిగిన, వాటిని సక్రమంగా సమాజంలో ఉపయోగించకపోతే, ఎంత క్రిందిగి దిగజారిపోతారో ఈ సినిమా ద్వారా గ్రహించవచ్చు. వ్యక్తి తెలివికి స్వేచ్చ తోడైతే, అహంకారానికి అడ్డు లేకుండా పొతే, సదరు వ్యక్తి ఎంత ప్రమాదకరమో ఈ చిత్రం ద్వారా గ్రహించవచ్చు.

మంచిచెడుల కలయిక సినిమాలు చెబితే

మంచిని చూపించాలంటే అమ్మని నాన్నని చూపిస్తే సరిపోతుంది, కానీ మంచి ముసుగులో ఉండబోయే చెడుని తెలియజేయాలంటే సామజిక చిత్రాలే ఉంటాయి. మంచిని ఎంతబలంగా చెప్పాలంటే అంత బలంగా చెడుఫలితాలు చూపించాలి కాబట్టి చెడుని సినిమాలు చూపితే, పరిస్థితులు వలన చెడు మంచిగా అనిపించవచ్చు కానీ చెడుని ఎంచుకుంటే చివరి ఫలితం ఏమిటో ధృవ తెలుగు చలన చిత్రం ద్వారా పతాక సన్నివేశాల్లో నుండి గ్రహించవచ్చు.

నేర్చుకునే వయసులో చెడు, చెడుని కప్పిపుచ్చే విషయాలు తెలిసిన అప్పుడు, వాటిని పట్టుకుని పైకి ఎదిగితే ఎలా ఉంటుందో, చెడు, చెడుని పెంచే విషయాలు తెలిసినా, వాటిని విడిచి, వాటి మూలంపై ఆలోచన సాగితే, ఆ ఆలోచన చేసిన వ్యక్తి ఎంత సమాజానికి ఎంత ప్రయోజనకారి అనే విషయం ధృవ చలనచిత్రం ద్వారా గ్రహించవచ్చు. చెడు తెలుస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా చెడు జరిగే అవకాశాలు ఉంటే, ఎలా రక్షణ పొందాలి, ఎలా రక్షించాలి ఈ సద్భావనతోనే సమాజంలో వ్యక్తులు ఉండాలి, సమాజంలో చెడు చలామణి అవుతూ ఉండవచ్చు, దాని నుండి గ్రహించే విషయం మనకిగాని, ఇతరులకు జరగకుండా జాగ్రత్తపడేదిగా భావిస్తే, చెడులో మంచి వెతికే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఏదైనా మంచి ముసుగులో చెడు చేస్తే వచ్చే ఫలితం ప్రమాదమే.

గ్రహించడం వలన ఆలోచన పుడితే, దానిని ఉపయోగించే విధానం

జేబుదొంగలు ఉంటారని, దొంగలు జేబులు దొంగిలించే విధానం ఇలా ఉంటుందని ఎవరైనా వినే వయసు ఉన్న వేరొకరికి జాగ్రత్తలు చెబితే, విన్నవారికి ఏదైనా ప్రయాణంలో జేబులో ఉండే వస్తువులపై జాగ్రత్త ఏర్పడుతుంది సాదారణంగా. అలా కాకుండా జేబుదొంగ ఎలా ఉంటారు ? ఎందుకు అలా తయారు అవుతారు అని ఆలోచన చేస్తే సామజిక అంశాలపై అవగాహనా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాకాకుండా జేబులో వస్తువులు ఈ విధంగా దొంగిలించవచ్చు అని ప్రాక్టీసు చేసి, ఎలా కొట్టేసినది అలానే ఎవరికీ తెలియకుండా తీసిన చోటే పెట్టేస్తే, నేర్పరి అయి దొంగలను పట్టుకునే తెలివితో రక్షణాదికారి కావచ్చు. అలా కాకుండా జేబులో వస్తువులు ఇలా కొట్టేయవచ్చు అని, ఆశతో ఆలోచన చేస్తే, సదరు వ్యక్తి దొంగగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జేబులో దొంగలించడం చెప్పిన వ్యక్తికీ దొంగతన విధానం తెలుసు, విన్న వ్యక్తికీ తెలుసు, దొంగని పట్టుకునే పోలీసుకి తెలుస్తుంది, ఎందుకు దొంగలు అని ఆలోచన చేసేవారికి తెలుస్తుంది. తనకోసం తన ఆశలు నెరవేర్చుకోవడం కోసం జేబు దొంగతనం అనే విషయం తెలియగానే ఆలోచన విధానం మారుతుంది.

నేర్చుకునే వయసులో నేర్చుకోవడంతో బాటు సామజిక బాద్యత, వ్యక్తిగత ధర్మం ఖచ్చితంగా తెలియాలి. ధృవ చిత్రంలో ప్రతినాయుకుడి తెలివితేటలకు అబ్బురపడి అతని తండ్రి రాజకీయ, సామజిక పరిస్థితులలో సహజంగా మౌనం వహించడమే పెద్ద నేరప్రవాహానికి ఒక కారణం, అయితే సమాజానికి నాయకత్వం వహిస్తున్న నాయుకుడే తప్పు చేసి ఇంకొకరి మీద వేయడానికి ప్రయత్నం నేరం సహజం అన్న ఆలోచన ప్రతినాయుకుని హృదయంలో కారణం కావచ్చు.

ధ్రువ చలన చిత్రంలో చేసేటప్పుడు ధృవ (రామ్ చరణ్) మాటలు పరిశీలన చేస్తే, అతడు చెడుని చదివాడు, ఆ చెడుపై ఆలోచన చేశాడు, చెడు యొక్క ప్రభావం, కారణాలు విశ్లేషణలు కొనసాగితే, అది ఓకే పరిశోదన ల్యాబ్ గా మారింది. సిద్ధార్ద్ అవకాశం వస్తే ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో మంచికి చెడుకి ఉన్న తేడానికూడా వాడుకున్నాడు కానీ మంచి మనిషి యొక్క గొప్పవ్యక్తి లక్షణం, అది తానూ కోల్పోతున్నాను అని తెలియకుండానే పట్టుబడ్డాడు.

ధృవ (రామ్ చరణ్) మంచిగా ఆలోచన చేసి మంచి తానే అయితే, చెడునిపట్టుకుని సిద్ధార్ద్ చెడె తానూ అయ్యాడు.

ధన్యవాదాలు

TeluguChitraTara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *