Bujjigadu-Made In Chennai, A Love Story of Childhood Friends Forever

Bujjigadu-Made In Chennai, A Love Story of Childhood Friends Forever

Bujjigadu-Made In Chennai, A Love Story of Childhood Friends Forever

Bujjigadu-Made in Chennai, A love story of childhood friends forever. చిన్ననాటి స్నేహం పెరిగాక కూడా ప్రేమగా ఉండి, ఒకరికొకరు కలవడానికి చేసే ప్రయత్నంలో వారు ఒకరిపైఒకరు ఏర్పరచుకున్న బలమైన అభిప్రాయం, ఈ చిత్రం ప్రధాన కధాంశం.

వైజాగ్లో పక్కపక్కనే ఉండే రెండిళ్ళలో నివసించే ఇద్దరు చిన్నారుల స్నేహంగా మెలుగుతూ ఉంటారు. ఆ ఇద్దరి పేర్లు బుజ్జి, చిట్టి. చిట్టి కోసం బుజ్జి, బుజ్జి కోసం చిట్టి అన్నట్టే స్నేహం బలమైన బంధంగానే ఉంటుంది. ఎందుకంటే చిట్టి చెబితే బుజ్జి ఏదైనా చేసేస్తాడు, చిత్ర ప్రారంభ సన్నివేశంలో చిట్టి రోడ్ మీద తనదారిన తానూ పోయేవాడిని ఒకరిని చూపించి, రాయి పెట్టి కొట్టమంటే వెంటనే రాయి తీసుకుని చిట్టి చూపిన వ్యక్తి తలపై కొడతాడు బుజ్జి. అంతగా ఇద్దరిమద్య స్నేహం చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. అయితే ఇద్దరి మద్య చిన్న గొడవ వచ్చి, ఇద్దరు పన్నెండు సంవత్సరాలు మాట్లాడుకోకూడదు, తరువాత ఇద్దరు కలుసుకుని పెళ్లిచేసుకోవాలి అని నిశ్చయించుకుంటారు. వెంటనే బుజ్జిగాడు తన తండ్రికి ఒక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. బుజ్జిగాడు చిట్టి వలనే వెళ్ళిపోయాడు అని, బుజ్జిగాడు తండ్రి చిట్టిపై కోపం పెంచుకుంటాడు. చిట్టి చిట్టి తల్లిదండ్రులు వైజాగ్లో ఇల్లు కాళీ చేసి వేరేచోటకి వెళ్ళిపోతారు.

బుజ్జిగాడు (ప్రభాస్) చిట్టి కోసం చిట్టికి దూరంగా చెన్నై వెళ్లి పెరిగి రజనికాంత్ అభిమానిగా పెద్దవాడు అవుతాడు (అప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి), రజనికాంత్ అభిమానిగా ఫైట్ సన్నివేశం, ఒక పాట పూర్తి అవగానే, బుజ్జి (ప్రభాస్) చిట్టి కోసం వైజాగ్ వచ్చేస్తాడు. వైజాగ్ వచ్చి రాగానే సత్తి(సునీల్)ని కలుస్తాడు, అదే సన్నివేశంలో సునీల్ కోసం పోలీసులు వెంటపడతారు, వారిని బుజ్జి(ప్రభాస్) కొడతాడు పోలీసులు అని తెలియకుండా. ఇంక పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలులో పెడతారు. జైలులో కలిసిన ఇద్దరు ఖైదీలు ప్రోద్భలం మరియు డబ్బుపై ఆశకల్పించి ఒక గూండాని చంపవలసినదిగా, అలా చంపితే ఒక కోటిరూపాయల ఇస్తామని బుజ్జికి చెబితే, అందుకు బుజ్జి (ప్రభాస్) ఒప్పుకుంటాడు. తరువాత జైలు నుండి తప్పించుకుంటాడు.

బుజ్జికోసం చిట్టి వెతికించడం, వెతకడం చేస్తూనే ఉంటుంది, అందులో భాగంగా చిట్టి చెల్లెలు(సంజన) చిట్టిగా బుజ్జి(ప్రభాస్) ఇంటికి వస్తే, బుజ్జి తల్లిదండ్రులు ఆమెను తిట్టి వెనుకకు పంపించేస్తారు. చిట్టి కోసం వైజాగ్లో బుజ్జి వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉన్న చిట్టి ఇంటికి వెళ్లి చిట్టిని పిలిస్తే, ఒక లావుపాటి అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. అప్పుడు బుజ్జి (ప్రభాస్) ఆ అమ్మాయి ఇలా ఉంది..అలా ఉంది.. అని చూడకుండా ఇలా మారిపోయవేమిటి అని ఆప్యాయంగా అడుగుతాడు. చిట్టి ఆమెకాదు వారు అక్కడ ఉండడం లేదు అని తెలుసుకుంటాడు. తండ్రిని కలిసి తన తండ్రి ద్వారా చిట్టి కుటుంబం హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుసుకుంటాడు. ఒకరికి తెలియకుండా ఒకరు చిట్టి కోసం వైజాగ్ వచ్చిన బుజ్జి (ప్రభాస్), బుజ్జి కోసం వైజాగ్ వచ్చిన చిట్టి చెల్లెలు ఇద్దరు ఒకే బస్సులో హైదరాబాద్ బయలుదేరతారు.

శివన్న ఇంటిలోనే చిట్టి (త్రిష), బుజ్జి(ప్రభాస్)లు ఒకరికొకరు తెలియకుండా నివసించడం.

లండన్ నుండి చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన చిట్టి(త్రిష)కి వాళ్ళ బాబాయి పెళ్లి సంభందం తీసుకువస్తారు, చిట్టి కాదని కచ్చితంగా చెబుతుంది. ఇక బుజ్జి జైలులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, బుజ్జి(ప్రభాస్) మాచిరెడ్డి (కోట శ్రీనివాసరావు)ని కలుస్తాడు. మేము చాలాకాలంగా చంపడానికి ప్రయత్నించి, చంపలేకపోయిన శివన్న(మోహన్ బాబు)ని నువ్వు చంపాలని బుజ్జికి శివన్న(మోహన్ బాబు) గురించి చెప్పి పంపిస్తాడు. శివన్నని చంపడానికి బయలుదేరతాడు బుజ్జి(ప్రభాస్). అయితే ఈలోపులో షాపింగ్ మాల్ దగ్గర, హోటల్లో బుజ్జి మరియు చిట్టి(త్రిష) ఒకరికొకరు తెలియకుండా తారసపడి పోట్లాడుకుంటూ ఉంటారు. మౌలాలి దగ్గర శివన్న(మోహన్ బాబుని ) చంపడానికి బుజ్జి(ప్రభాస్) వెళ్ళిన బుజ్జి, శివన్నకి చేతికి చిక్కుతాడు. బుజ్జి ఇరవైమందితో ఫైట్ చేసిన విధానం చూసి ముచ్చటపడి బుజ్జిని శివన్న తన ఇంటికి తీసుకువెళతాడు. ప్రధమ భాగం సమాప్తం అవుతుంది.

చిట్టి(త్రిష)కి బుజ్జిని వెతికే ప్రయత్నంలో, బుజ్జి కోసం హైదరాబాద్ వచ్చిన సత్తి(సునీల్) సహాయం చేస్తానని అని చిట్టి, సత్తి ఇద్దరు బుజ్జిని వెతుకుతూ ఉంటారు. తండ్రి ద్వారా లభించిన మొబైల్ నెంబర్ ఆధారంగా చిట్టి శివన్న చెల్లెలే అని తెలుసుకుంటాడు బుజ్జి(ప్రభాస్), అయితే అప్పుడే నీవు బుజ్జి అని చిట్టి(త్రిష)కి చెప్పవద్దని మాట తీసుకుంటాడు బుజ్జి దగ్గర శివన్న. తరువాత నుండి బుజ్జి నేనే అని చెప్పకుండా చిట్టి(త్రిష)ని అటపట్టిస్తూ ఉంటాడు. కానీ చిట్టికోసం శివన్న ఇంటికి వచ్చిన సత్తి బుజ్జి వాయిస్ విని, బుజ్జి, బుజ్జి, అని అరుస్తూ కేకలు పెడతాడు, ఆ కేకలు విన్న చిట్టి శివన్నని నిలదీస్తుంది, బుజ్జి ఎవరో చెప్పమని, బుజ్జిని చిట్టికి చూపిస్తుండగా శివన్నకి తగలవలసిన బులెట్ చిట్టికి తగులుతుంది. చిట్టిని హాస్పిటల్లో జాయిన్ చేయడం, మాచిరెడ్డి మనుషులు చిట్టి చెల్లెల్ని(సంజన) కిడ్నాప్ చేసి, శివన్న అప్పజెప్పవలసినదిగా బుజ్జిని మాచిరెడ్డి డిమాండ్ చేస్తాడు. తరువాత బుజ్జి, శివన్న కలిసి వారిని మట్టుబెట్టడంతో కధ ముగుస్తుంది. ఇంత కధకు కారణమైన చిన్ననాటి చిట్టి, బుజ్జిల తగువు చివర్లో చూపిస్తారు.

ఆరంభం నుండి ముగింపు వరకు అంటే చిన్ననాటి నుండి యవ్వనంలో కూడా ఇద్దరి మనస్సులు ఒక్కటై ఉండడం, ఇద్దరిలో ఎవరు ఇంకొకరి తలంపు లేకుండా ఉండడం ఈ చిత్రంలో ప్రధానాంశం. కుటుంబం నుండి దూరం అయిన కుటుంబంతో కలిసి జీవించినా ప్రేమ ఎప్పుడూ మారదు అని ఈ కధ సారాంశంగా సాగుతుంది.

ధన్యవాదాలు
teluguchitratara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *